English   

యాత్ర టీజర్ :  నేను విన్నాను.. నేనున్నాను

Yatra-Teaser
2018-12-21 14:01:48

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న‘యాత్ర’ చిత్ర టీజర్ ఈరోజు వైఎస్ తనయుడు జగన్ జన్మదినం సందర్భంగా రిలీజైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన రాజశేఖర రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. మళయాళ నటుడు మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తున్నారు.

‘నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా, మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు’ అంటూ ఓ రైతు తన గోడు వెల్లబోసుకుంటున్న సీన్ తో మొదలయిన టీజర్ జనాల్లో అంచనా పెంచేస్తోంది. దానికి సమాధానంగా  ‘నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి పలికే డైలాగ్స్‌ టీజర్ మొత్తానికే హైలెట్‌గా చెప్పొచ్చు.  ఇక టీజర్‌లో మమ్ముట్టి చూపిన హావభావాలు చూస్తుంటే.. స్వయానా వైఎస్ఆరే దిగొచ్చారా! అన్నట్లుగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 70 ఎంఎం పతాకంపై మహి వీ రాఘవ తెరకెక్కిస్తోన్న ‘యాత్ర’ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories