English   

'వెన్నుపోటు’ సాంగ్ విడుదల...ఎన్ని వివాదాలో !

Lakshmis-NTR
2018-12-21 17:51:50

ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని ‘వెన్నుపోటు’ పాటను ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు కల్యాణి మాలిక్ లకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వర్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, అసలు కథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని ఆర్జీవీ తెర్కక్కిస్తున్నడు.

ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేశారంటూ ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న ఆనాటి ఫోటోలను చూపిస్తూ బ్యాంగ్రౌండ్‌లో పాట ప్లే అవుతోంది. ఈ పాట మరో వివాదానికి తెర తీసేలా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు వర్గం ఈ పాటను వ్యతిరేకించే అవకాశం ఉంది.  ‘దగా...దగా.. మోసం..నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. వంచించి..వంచించి వెన్నుపోటు పొడిచారు. కుట్ర..కుట్ర..కుట్ర..’ అంటూ ఈ పాట కొనసాగింది. ఈ సాంగ్ విడుదలకు సంబంధించి వర్మ ట్విట్టర్‌లో ప్రచారం భారీగా చేశారు.

ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో చెబుతున్నట్లు వర్మ చెప్పిన డైలాగులు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ‘ఈ సినిమాలో నిజం ఉంది. ఇంట్లోనూ వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు కావొచ్చు. సార్ అవేంటో మీకు, మీ కుటుంబానికి, మీ ఇంటల్లుడికి బాగా తెలుసు సార్. మీరు చెప్పరు కాబట్టే నేను చెప్పాల్సొస్తోంది’ అంటూ వర్మ చెప్పదం ఎన్ని వివాదాలకు కారణం అవుతుందో ఏమో ?  

More Related Stories