English   

పవన్ వెన్నుపోతూ తప్పదు...జాగ్రత్త !

Pawan
2018-12-21 11:02:41

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను హెచ్చరిస్తూ జనసేన పార్టీ ముఖ్య నేత ఎప్పుడూ పవన్ వెన్నంట ఉండే నాదెండ్ల మనోహర్ గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్లు చేశాడు. పవన్‌కు వెన్నుపోటు ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. గతంలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ పవన్ పక్కనే ఉండి నవ్వుతుండడం తనను ఆందోళనకు గురిచేస్తోందని అన్నాడు. దయచేసి ఈ విషయంలో పవన్‌ను హెచ్చరించాలని ఆయన అభిమానులను కోరాడు.

‘‘గతంలో ఎన్టీఆర్ పక్కన నిలబడి నాదెండ్ల మనోహర్ తండ్రి ఎలా అయితే నవ్వేవాడో.. ఇప్పుడు పవన్ పక్కన మనోహర్ కూడా అచ్చం అలాగే నవ్వుతున్నాడు. దీని గురించే నా ఆందోళనంతా. దయచేసి మీరైనా పవన్‌కు చెప్పండి’’ అని వర్మ ట్వీట్ చేశాడు. పవన్‌కు మనోహర్ వెన్నుపోటు పొడవకూడదని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

 వెన్నుపోటు నుంచి ఎన్టీఆరే తప్పించుకోలేకపోయారని, పవన్ కూడా తప్పించుకోలేరని అన్నాడు. ప్రజల కష్టాలను తీర్చేందుకు పవన్ ముందుకు వెళ్తుంటే మనోహర్ వెనక నుంచి ఎక్కడ దాడి చేస్తాడో అని భయంగా ఉందన్నాడు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు, జనసేన అంతర్గత వర్గాలతోపాటు నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యుల నుంచి తనకు నేరుగా సమాచారం అందుతోందని, పవన్‌ను వెన్నుపోటు పొడిచేందుకు మనోహర్ ప్లాన్ చేస్తున్నాడన్నదే ఆ సమాచారమని వివరించాడు.  అభిమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

More Related Stories