English   

సైరాలో తమన్నా ఫస్ట్ లుక్...క్లారిటీ రాలే !

Tamannah
2018-12-21 18:15:11

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' నిర్మితమవుతోంది. కిక్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాను రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సౌత్‌ టాప్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ రోజు తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఫస్టులుక్ ను మోషన్ టీజర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా లక్ష్మి పాత్రలో కనిపించనుందనేది మోషన్ టీజర్ సారాంశం. తమన్నా పాత్ర తీరుతెన్నుల  విషయం అటుంచితే, ఆమె వేషధారణ మాత్రం కొత్తగా వుంది. కొత్త తమన్నాను తెరపై చూడబోతున్నామనే ఆసక్తిని పెంచుతోంది. 

ఇప్పటిదాకా తమన్నా పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. జోగిని పాత్రలో తమన్నా కనిపించబోతుందని కొందరు అంటూ ఉంటే నరసింహారెడ్డి శిష్యురాలిగా కనిపించబోతుందని మరి కొందరు అంటున్నారు. ఫస్ట్ లుక్ లో ఆమె పాత్ర ఏంటీ అనేది ఆమె పాత్ర పేరు ఏంటీ అనే విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 'బాహుబలి' తరువాత తమన్నా చేస్తోన్న భారీ చిత్రం ఇదే. ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Related Stories