English   

సంక్రాంతికే ప్రభాస్....కానీ !

prabhas upcoming movie shooting begins with radha krishna kumar
2018-12-22 01:46:38

ప్రభాస్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని రొమాంటిక్ లవ్ స్టోరీని కూడా ప్రభాస్ పట్టాలెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటలీలో జరిగిన ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. సాహో షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంకంతా పూర్తవుతుంది కాబట్టి ఐదు నెలలు కేవలం గ్రాఫిక్స్ కోసమే కేటాయించబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదు కనుక కాస్త ముందే వచ్చే అవకాశాలున్నాయని అనుకుంన్నారు, కానీ సాహో పూర్తి అయ్యే వరకు ఆ మూవీని అప్పుడప్పుడు మాత్రమే చేస్తాడట. తాజా అప్డేట్ ఏంటంటే రాదా కృష్ణ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే ఫిక్స్ అయ్యారట. ప్రేక్షకులు ప్రభాస్ ను రొమాంటిక్ లవ్ స్టోరీలో చూసి చాలాకాలమే అయింది. వాళ్ల ముచ్చట 2020 సంక్రాంతికే తీరనుందన్న మాట.

More Related Stories