English   

బాలయ్య చిరంజీవిని పిలిచారో లేదో ?

NTRBiopic audio function  Nandamuri Balakrishna  is Not Invited Chiranjeevi?
2018-12-22 08:57:27

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ ఈ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నేడు జూబ్లీ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సహా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోలు మరియు ప్రముఖులు ఎంతో మందిని బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబులతో పాటు టాలీవుడ్ కు చిందిన పలువురు ప్రముఖులను బాలయ్య స్వయంగా ఆహ్వానించారు. కృష్ణ - కృష్ణంరాజు - మోహన్ బాబు వంటి ప్రముఖులను బాలయ్య స్వయంగా ఆహ్వానించినట్లుగా నందమూరి వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. గతంలో తన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి చిరంజీవిని ఆహ్వానించిన బాలయ్య ఈసారి మాత్రం చిరంజీవిని పక్కకు పెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో చిరంజీవి పాత్ర ఉంటుందని అనుకున్నప్పటికీ బాలయ్య ఆ పాత్రను పక్కన పెట్టారట. మరోవైపు, రాజకీయ కారణాల వల్లే చిరంజీవిని బాలయ్య ఆహ్వానించి ఉండకపోవచ్చని ఫిలింనగర్ టాక్.

More Related Stories