English   

జనసేనలోకి హైపర్ ఆది !...క్లారిటీ ఇచ్చాడుగా

hyper aadi comments on jabardasth show and janasena party
2018-12-22 09:04:44

హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈటీవీలో ప్రసారమయ్యే ’జబర్దస్త్‌’ కార్యక్రమం ద్వారా ఆయన పాపులర్ అయిపోయాడు. ఎదుటి వారి మీద పంచ్‌ లు వేస్తూ ‘హైపర్ ఆది’గా ఫేమస్ అయిపోయాడు. అయితే కొంతకాలంగా ఆది ‘జబర్దస్’లో కనిపించకపోవడంతో ఆదికి యాక్సిడెంట్ అయిందని, పెళ్లి చేసుకున్నాడని, పవన్‌కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీలో చేరుతున్నాడని ఇలా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ వార్తలన్నింటికి ఆది తాజాగా క్లారిటీ ఇచ్చారు.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఆది చెప్పారు. షూటింగులతో పాటు కొన్న వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణంగానే బజర్దస్త్‌కు దూరమయ్యాయని, ఫిబ్రవరి నుంచి మళ్లీ జబర్దస్త్ టీమ్‌తో జాయిన్ అవుతానని చెప్పారు. కాలేజీలో ఉన్నప్పుడు జబర్దస్త్ చూసేవాడినని కానీ ఎప్పుడూ తాను ఇంతవరకు వస్తానని అనుకోలేదని చెప్పుకొచ్చారు. తాను పవన్‌కు పిచ్చి అభిమానినని, ఓ వ్యక్తిగా ఆయన్ని సపోర్ట్ చేస్తానని చెప్పారు. అయితే జనసేన పార్టీలో చేరే ఆలోచనేదీ తనకు లేదన్నారు. అన్నం దానం చేసేవారిని అన్నదాత, చదువు దానం చేసేవారిని గురువు అన్నట్లుగానే ప్రజల కోసం భవిష్యత్‌ను దానం చేసేవారిని పవన్‌కళ్యాణ్ అంటారని ఆది అన్నారు. పవన్ గురించి తెలుసుకున్న ఎవరైనా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఉండలేరని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories