English   

తమిళనాట మూడు చానెళ్ళు పెట్టనున్న రజనీ !

super star Rajinikanth  Launch Television Channel
2018-12-22 02:19:27

రోబో 2.ఓ, పెట్టా సినిమాలతో జోరుమీదున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా రాజకీయ రంగంలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ త్వరలో ప్రకటించనున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో తన పార్టీ కోసం ప్రచారానికి సొంత టీవీ ఛానల్స్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేకు కలైంజ్ఞర్ టీవీ, అన్నాడీఎంకేకు జయ టీవీ వంటి ఛానల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు తనకు సొంత ఛానళ్ల అవసరం ఉందని రజనీ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు టీవీ ఛానల్స్ ప్రారంభించేందుకు రజనీకాంత్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు సొంత టీవీ ఛానల్ అవసరమని రజనీకాంత్ భావిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ టీవీ, సూపర్ స్టార్, తలైవా టీవీ పేరుతో మూడు ఛానల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతుందని, వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజస్టర్ అయినట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువరిస్తామని పేర్కొన్నాయి. 

More Related Stories