English   

బాలయ్య – బోయపాటి ఫిక్స్ అయ్యారు !

Balakrishna-Boyapati
2018-12-22 11:08:38

తెలుగువారి ఆరాధ్యదైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్.టీ.ఆర్’. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలో తన తర్వాతి సినిమా గురించి కూడా ప్రకటించాడు బాలయ్య. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రోమో కూడా విడుదల చేశారు. 

ఇక బోయపాటి తో బాలయ్య మూవీ ఎనౌన్సమెంట్ జరగగానే ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో స్టేజ్ మీదకెక్కిన బోయపాటి మొహం 1000 కేండిల్స్ బల్బులా వెలిగిపోయింది. ఇక ఆనందంలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడిన బోయపాటి ఎన్టీఆర్ బయోపిక్ ని త్వరగా పూర్తి చేసిన క్రిష్ కి కృతఙ్ఞతలు చెప్పి బాలయ్య తన కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలకన్నా ఒక పది శాతం ఎక్కువున్న సినిమానే అందించడానికి కష్టపడతానని.. ఫిబ్రవరిలో మొదలవ్వబోయే సినిమా గురించి అప్పుడే అన్ని విషయాలు వెల్లడిస్తామని.. అంటే ఆ సినిమా నటీనటులు, రెగ్యులర్ షూటింగ్ వివరాలు అందిస్తామని చెప్పాడు.

More Related Stories