English   

‘యన్.టి.ఆర్’ ట్రైలర్ టాక్.. బాలయ్యా...ఎన్టీవోడా !

Balakrishna
2018-12-22 14:28:53

విశ్వవిఖ్యాత నట సార్యభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కొడుకు బాలకృష్ణ ప్రధాన పాత్రలో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినీ చరిత్రను ‘కథానాయకుడు’గా, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గా తెరపై ఆవిష్కరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ చిత్రాన్ని జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. క్రిష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను నిన్న విడుదల చేశారు.

ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలు కలిసి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలకు కలిపి ఒకే ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణను పెద్దవాళ్లు ఎవరైనా చూస్తే ‘బాలయ్య కాదు ఎన్టీవోడే’ అనక మానరు. నేను ఉద్యోగం మానేశాను ! ఎందుకు మానేశావు ? నచ్చలేదు ! మరేం చేద్దామని ? సినిమాల్లోకి వెళతాను ! నిన్ను చూడటానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకు  వస్తున్నారు, ఇలా నువ్వే వెళ్లి కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు, జనం కోసమే సినిమా అనుకున్నాను, ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను’, ‘ఇక్కడ నిన్నందరూ దేవుడు అంటున్నారు అక్కడ నువ్వు కూడా అందరిలా మనిషివి అయిపోతావు బావ’, ‘తారకం నన్ను దేవుణ్ని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను’, ‘ధనబలమైతే బలుపులో కనిపిస్తుంది. కానీ, ఇది జనబలం.. ఒక్క పిలుపులో వినిపిస్తుంది’ అంటూ వచ్చే డైలాగ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయ ప్రస్తానం రెండింటిని చూపిస్తూ రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.   

More Related Stories