English   

'ఆర్ఆర్ఆర్' లో అదితిరావు హైద‌రీ !

Aditi-Rao-Hydari
2018-12-22 16:34:17

బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితిరావ్ హైదరీ ‘సమ్మోహనం‌’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తాజాగా ‘అంతరిక్షం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామకు భారీ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ కాంబినేష‌న్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది.  

ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి స‌మాచారం బయటకు రాలేదు. కీర్తి సురేశ్, కైరా అడ్వాణీ, సమంత, రాశీఖన్నా వంటి కథానాయికల పేర్లు విపిస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా మ‌రో హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ద‌క్షిణాదిన అన్ని భాష‌ల‌తోపాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు క‌లిగిన అదితీ రావు హైద‌రీని ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌లు భాష‌ల్లో గుర్తింపు ఉండ‌డంతోపాటు మంచి న‌టిగా కూడా అదితి ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకుంది. దీంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆమెకు క‌థ వినిపించ‌నున్నార‌ని స‌మాచారం. దీనిపై యూనిట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

More Related Stories