English   

వివాదాల్లో వెన్నుపోటు..వర్మపై కేసులు !

RGV
2018-12-22 10:06:25

అనుకున్నదే అయ్యింది, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీపార్వతి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాన పాత్రలుగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘వెన్నుపోటు’ పాటను ఆయన నిన్న విడుదల చేశారు. కాగా, ఈ పాట ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువు అయింది. బయోపిక్ లోని ‘వెన్నుపోటు’ సాంగ్‌ను వర్మ శుక్రవారం ట్విటర్ ద్వారా విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌తో చంద్రబాబు కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తూ వెనుక ‘కుట్ర కుట్ర’ అంటూ కఠినమైన పదాలతో సాంగ్ ప్లే అవుతోంది.  అయితే ఈ పాటపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొందరు వర్మను ముందు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్మతో పాటు కుట్ర వెనుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. వర్మ వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో తేల్చాలని, వర్మను శిఖండిలా ముందు పెట్టుకుని కథ నడిపిస్తువారు ముందుకు రావాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్మతో పాటు నటీనటులు, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నిపుణులపై ఏపీ అంతటా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

More Related Stories