English   

గెస్ట్ గా వెళ్లి పాతుకుపోతాడా ?

Vijay-Devarakonda
2018-12-22 18:02:56

విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు ? అన్నది కొన్ని రోజుల నుండి ఒక ట్రేండింగ్ టాపిక్‌. జాన్వీ కపూర్‌తో చేసే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని, విజయ్‌ని కరణ్‌ జోహార్‌ పరిచయం చేస్తారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ‘83’ చిత్రం ద్వారా విజయ్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని టాక్‌. 1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ రూపొందించనున్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ తమిళనాడు క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ డ్యాషింగ్ ఓపెనర్. ఒక వేళ ఇదే నిజమైతే బాలీవుడ్‌కి ముందు గెస్ట్‌గా వెళ్లి, ఆ తర్వాత హీరోగానూ చేస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారాయన రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కే సన్నివేశాల్లో స్లిప్‌ అవ్వడంతో విజయ్‌ చేతికి చిన్నపాటి గాయమైంది. అయితే విజయ్ దేవరకొండ క్రికెటర్ గా నటించే 83 చిత్రం తర్వాత కరణ్ జోహార్ సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేయనున్నాడు.
 

More Related Stories