English   

ప్రభాస్ ది అంత పాత ప్రేమా ?

Prabhas
2018-12-22 11:45:54

ప్రభాస్ బాహుబలి విడుదలై అప్పుడే ఏడాదిన్నర పైనే అయ్యింది. బాహుబలి విడుదలకు ముందే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాని పట్టాలెక్కించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా లేట్ గా మొదలైంది. తాజాగా సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2019 ఆగష్టులో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే సాహో ప్రయాణం సుదీర్ఘంగా సాగడంతో ప్రభాస్ ఈ లోపు రాధాకృష్ణతో మరో లవ్ స్టోరీ మొదలు పెట్టేసాడు. 

ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని 2019 చివరిలో విడుదల చేస్తామని దర్శకుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇది 1960ల కాలం నాటి అద్భుతమైన ప్రేమకథ అనే విషయం తాజాగా బయటికి రావడంతో అందరిలో మరింతగా ఆత్రుత పెరిగిపోతోంది. ఈ ప్రేమకథ గురించిన అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ "ప్రభాస్ అభిమానులు .. తొందరపడకండి. అన్ని ఆసక్తికరమైన విశేషాలను సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాము" అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీమంతుడిగా పాతకాలం నాటి కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో కథానాయిక ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అనుష్కను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  అంటే 2019 లో సాహో 2020 లో మరొక సినిమాతో ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చెయ్యబోతున్నాడన్నమాట.

More Related Stories