English   

గోపీచంద్ స్పై థ్రిల్లర్....నిలబెట్టేనా ?

gopi chand new movie  launched
2018-12-23 01:10:55

కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ గోపీచంద్ కొంత గ్యాప్ ఇచ్చాడు. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడడంతో ఆచితూచి సినిమాలు ఓకె చేస్తున్నారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించే ఒక స్పై థ్రిల్లర్ లో గోపీచంద్ నటిస్తున్నాడు. దర్శకుడు 'తిరు' చెప్పిన కథ నచ్చడంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ సినిమాకి విశాల్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జనవరి 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కథానాయికలను ఇంకా ఫనల్ చేయలేదు. త్వరలోనే వాళ్ల పేర్లను ఎనౌన్స్ చేస్తారు. కొత్త కాన్సెప్ట్ తో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ఈ సినిమా వుంటుందని, ఎక్కడా డీవియేషన్ వుండదని యూనిట్ వర్గాల సమాచారం. దీంతో ఈ సినిమాతో తనకి హిట్ పడటం ఖాయమనే ఆశాభావంతో గోపీచంద్ వున్నాడు.

More Related Stories