English   

జిఎస్టీ.. సినిమా టికెట్ల రేట్ల‌పై త‌గ్గింపు..

Lower GST on Movie tickets
2018-12-23 01:17:07

సినిమా టికెట్ ఇప్పుడు కొనాలంటే క‌నీసం 100 రూపాయ‌లైనా పెట్టాల్సిందే. మ‌ల్టీప్లెక్సులు అయితే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఒక్క‌సారి కుటుంబంతో అలా స‌ర‌దాగా సినిమాకు వెళ్దాం అనుకుంటే చాలు 1000 రూపాయ‌లు అలా ఎగిరిపోతాయి. కొన్నేళ్లుగా ఇదే ప‌రిస్థితి. సామాన్యుడికి అందుబాటులో సినిమాను అధిక ధ‌ర‌ల‌తో త‌ల‌కు మించిన భారంగా మార్చేసింది జిఎస్టీ. అది వ‌చ్చిన త‌ర్వాత అస‌లు సినిమా అంటేనే మ‌ధ్య త‌ర‌గ‌తి వాడు భ‌య‌ప‌డే స్థాయికి వ‌చ్చేసింది ప‌రిస్థితి. ఇప్పుడు ఇలాంటి వాళ్ల కోసమే తీపిక‌బురు చెప్పింది కేంద్రం. జిఎస్టీ ప‌న్ను సినిమా టికెట్ల‌పై త‌గ్గించారు. ప్ర‌స్తుతం ఈ ప‌న్ను 100 రూపాయ‌ల కంటే త‌క్కువ రేట్లు ఉన్న టికెట్ పై 18 శాతం ఉంది. దాన్ని ఇప్పుడు 12 శాతానికి కుదించారు. ఇక 100 రూపాయ‌ల కంటే పైన ఉన్న టికెట్ల‌కు 28 శాతం ఉండేది.
ఇప్పుడు దాన్ని ప‌ది త‌గ్గించి 18 శాతంకు ఫిక్స్ చేసారు. దానివ‌ల్ల కొద్దొగొప్పో టికెట్ రేట్లు అయితే త‌గ్గుతున్నాయి. మ‌రీ ఎక్కువ కాక‌పోయినా ప‌ర్లేదు అనే స్థాయిలో రేట్లు త‌గ్గ‌నున్నాయి. ఈ కొత్త రేట్లు జ‌న‌వ‌రి 1 నుంచి కేంద్రం అమ‌ల్లోకి తీసుకురానుంది. అంటే ఇప్పుడు 100 రూపాయల టికెట్ పై 12 రూపాయ‌ల ప‌న్ను మాత్ర‌మే ప‌డుతుంది. ఇక 100 కంటే ఎక్కువ‌గా ఉంటే 18 రూపాయ‌లు ప్ర‌భుత్వం ఖాతాలోకి వెళ్ళిపోనుంది. సినిమా టికెట్ ధరల మీద పన్నులను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యానికి సీబీఎఫ్‌సీ చైర్ పర్సన్ ప్రసూన్ జోషి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సినీ పరిశ్రమకు, సినిమా ప్రియులకు దీనివ‌ల్ల లాభాలున్నాయ‌ని చెప్పారు. మొత్తానికి సినిమా ఇండ‌స్ట్రీని బ‌తికించండి మ‌హాప్ర‌భో అని నిర్మాత‌లు పెట్టుకున్న మొర మోదీనికి కాస్తైనా క‌రిగించింది అదే ప‌దివేలు.

More Related Stories