English   

ప‌డిప‌డి లేచె మ‌న‌సు.. త‌ప్పెక్క‌డ జ‌రిగింది..?

padi padi leche manasu movie collections
2018-12-23 08:40:18

ప‌క్కా హిట్ అనుకున్న సినిమాలు కొన్ని స‌డ‌న్ గా తేడా కొడుతుంటే నిర్మాత‌ల‌కు ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ ప్రేక్ష‌కులు మాత్రం షాక్ లోనే ఉంటారు. ఎందుకంటే అర్రె.. ఈ సినిమా ఫ్లాప్ అయిపోయిందా అంటూ వాళ్లు కూడా ఆస‌క్తిగా చూస్తుంటారు. ఇప్పుడు ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప‌రిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. అస‌లు కొంచెం కూడా ఈ సినిమాపై నెగిటివ్ ఆలోచ‌న‌లు లేవు ఎవ‌రికీ. కానీ ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత మాత్రం సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది.. కానీ క‌లెక్ష‌న్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తొలిరోజు కేవ‌లం 2.60 కోట్ల షేర్ తో స‌రిపెట్టుకుంది ఈ చిత్రం. శ‌ర్వానంద్ గ‌త సినిమా మ‌హానుభావుడు 4 కోట్ల‌కు చేరువ‌గా వ‌సూలు చేసింది తొలిరోజు. కానీ ఇప్పుడు అంత‌కంటే త‌క్కువ తీసుకొచ్చింది ప‌డిప‌డి లేచె మ‌న‌సు.
పైగా సాయిప‌ల్ల‌వి కూడా సినిమాలో ఉంది. అయినా కూడా వ‌సూళ్లు అనుకున్న‌ట్లుగా రాలేదు. స్లో నెరేష‌న్ ఈ సినిమా కొంప ముంచేసింది. సాయిప‌ల్ల‌వి, శ‌ర్వానంద్ అద్భుతంగా న‌టించినా కూడా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాను నిలువునా ముంచేసింది. హ‌ను రాఘ‌వ పూడి క్లాసీ నెరేష‌న్ అస్స‌లు ప‌ట్టించుకోలేదు ప్రేక్ష‌కులు. దాంతో సినిమా కూడా దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగులేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మంచి సినిమా అనిపిస్తున్నా కూడా క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ప‌డిప‌డి లేచె మ‌న‌సు అనుకున్న ల‌క్ష్యం అందుకోవ‌డం ఆకాశ‌మంత ఎత్తులో ఉంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 25కోట్ల‌కు పైగానే రావాలి. మ‌రి అంత వ‌స్తుందో.. అంత‌లో ఎంతొస్తుందో చూడాలిక‌.

More Related Stories