English   

అంత‌రిక్షం.. అరెరే వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ మిస్ అయిందే..

VARUN TEJ's ANTARIKSHAM movie collections
2018-12-23 08:46:56

హ్యాట్రిక్.. వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు.. ఏ హీరోకైనా క‌ల అది. వ‌ర‌స‌గా మూడు సినిమాలు నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్ట‌డం అంటే చిన్న విష‌యం అయితే కాదు. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కూడా ఇదే చేయాల‌నుకున్నాడు కానీ కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్స్ త‌ర్వాత చేసిన అంత‌రిక్షం సినిమాకు మంచి పేరు వ‌స్తుంది కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం నిల‌బ‌డేలా క‌నిపించ‌డం లేదు. ఈ చిత్రానికి తొలిరోజు కేవ‌లం కోటిన్న‌ర షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. అస‌లు ఇంత త‌క్కువ వసూలు చేయ‌డం ఇప్పుడు ట్రేడ్ ను కూడా ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తుంది. వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు అందుకున్న హీరో.. ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు.. క్రిష్ నిర్మాణంలో వ‌స్తున్న సినిమాకు అస‌లు హైప్ లేక‌పోవ‌డం.. క‌లెక్ష‌న్స్ త‌క్కువ‌గా రావ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉందిప్పుడు.
రెండోరోజు కూడా ఇదే ప‌రిస్థితి. వ‌సూళ్లు అనుకున్న‌ట్లుగా రావ‌డం లేదు. వ‌రుణ్ తేజ్ బాగా చేసినా.. సంక‌ల్ప్ రెడ్డి క‌థా సంక‌ల్పం మాత్రం ధృడంగా లేదు. ఈ సినిమా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఓకే అనిపించినా కూడా సెకండాఫ్ మాత్రం దారుణంగా సాగింది. స్లో నెరేష‌న్ కు తోడు స్పేస్ లోనే అటూ ఇటూ తిరిగే కథ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. దాంతో కొత్త ప్ర‌య‌త్నం అని ఎంత క‌న్విన్స్ చేసుకున్నా కూడా క‌థ‌నం నెమ్మ‌దించ‌డం సినిమాకు మైన‌స్ గా మారిపోయింది. దాంతో అంత‌రిక్షంతో హ్యాట్రిక్ కొట్టాల‌నుకున్న వ‌రుణ్ తేజ్ ఆశ‌ల‌కు పూర్తిగా గండి కొట్టేసింది ఈ చిత్రం.

More Related Stories