English   

ఎన్టీఆర్ ను స‌పోర్ట్ చేస్తున్న మ‌హేష్ బాబు..

mahesh babu responded about ntr biopic movie
2018-12-23 08:53:32

మ‌హేష్ బాబు ఏంటి.. ఎన్టీఆర్ ను స‌పోర్ట్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డ ఎన్టీఆర్ అంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ కాదు.. ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి మ‌హేష్ బాబు మాట్లాడుతున్నాడు. ఈయ‌న ఈ మ‌ధ్య ప్ర‌తీ సినిమాను చూసి ట్వీట్ చేస్తున్నాడు. త‌న‌కు సినిమా న‌చ్చిందంటే చూసి అలా వ‌దిలేయ‌కుండా దాని గురించి నాలుగు మంచి ముక్క‌లు రాస్తున్నాడు. ఇప్పుడు బ‌యోపిక్ గురించి కూడా ఇదే రాస్తున్నాడు మ‌హేష్. బాల‌య్య న‌టిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లై.. ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ ట్రైల‌ర్ పై ఇండ‌స్ట్రీ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా చూసాడు ఈ ట్రైల‌ర్ ను.
చూసి ఊరికే ఉండ‌కుండా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ ట్రైల‌ర్.. బాల‌య్య గారు మీరు ఎన్టీఆర్ గారిలా మారిపోయిన తీరు అద్భుతంగా ఉంది.. ట్రైల‌ర్ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయంటూ ట్వీట్ చేసాడు. ఇక క్రిష్ కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ బ‌యోపిక్ కోసం వేచి చూస్తున్నానంటూ రాసుకొచ్చాడు సూప‌ర్ స్టార్. ఈయ‌న నుంచి వ‌చ్చిన ప్ర‌శంస‌ల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ యూనిట్ కూడా ఖుషీ అయిపోయింది. సూప‌ర్ స్టార్ త‌మ సినిమాను పొగ‌డటం బాగుందంటూ ఆనంద‌ప‌డుతున్నారు వాళ్ళు. మ‌హేష్ బాబుతో పాటు ఇండ‌స్ట్రీలో ప‌లువురు కూడా ఎన్టీఆర్ ట్రైల‌ర్ చూసి ఫిదా అయిపోయారు. బాల‌య్య‌తో పాటు క్రిష్ వ‌ర్కింగ్ కూడా వాళ్ల‌ను మాయ చేసింది. మ‌రి రేపు సినిమా కూడా మాయ చేస్తే ఇండ‌స్ట్రీలో రికార్డులు ఖాయ‌మే. ఏం జ‌రుగుతుందో చూడాలిక ఈ సంక్రాంతికి అస‌లు ఆట‌.

 

More Related Stories