English   

విజయ్ సేతుపతి నక్కతోక గానీ తోక్కాడా ?

Vijay Sethupathi's Seethakathi Movie Review
2018-12-23 02:04:29

ఇటీవల విజయ్ సేతుపతి చేసిన '96' మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఆ సినిమా విజయ్ సేతుపతిని నటనలో మరో మెట్టు పైకి చేర్చింది. ఈ సినిమా సక్సెస్ ను ఆడియన్స్ మరిచిపోకమునుపే విజయ్ సేతుపతి మరో విజయాన్ని అందుకున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తాజా చిత్రంగా 'సీతా కత్తి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 8 సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా అక్కడ విడుదలైంది. ఈ పోటీలో ధనుశ్ 'మారి 2' కూడా వుంది. ఈ సినిమాలన్నింటిని తోసిరాజని 'సీతాకత్తి' మంచి మార్కులు కొట్టేసి ఈ క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది. 'భారతీయుడు' సినిమాలో సీనియర్ కమలహాసన్ లుక్ కి దగ్గరగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. సేతపతి హీరోగా `నడువుల కొంజెం పక్కత్త కానోమ్` అనే సూపర్ హిట్ సినిమా తీసిన బాలాజీ ఈ చిత్రాన్ని రూపొందించడంతో బిజినెస్ లోనూ కలిసొచ్చింది. ఈ చిత్రానికి పోటీగా నిలుస్తుందనుకున్న ధనుష్ మారి-2 యావరేజ్ గా నిలిచింది. ధనుష్ మాస్ అవతారం బావున్నా కంటెంట్లో రొటీన్ గా ఉండడంతో జనాలు యావరేజ్ అని తేల్చేశారు. కథాబలంతోనే ఈ సినిమాకి బలమని చెబుతున్నారు. 70 యేళ్లు పైబడిన వృద్ధుడి పాత్రలో సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. నిస్సందేహంగా ఈ క్రిస్మస్ విజేత విజయ్ సేతుపతినే అని చెబుతున్నారు.

More Related Stories