English   

పిక్ టాక్...ధనుష్ 'అసురన్' ఫస్ట్ లుక్ !

Dhanush releases the first look from his next film Asuran
2018-12-23 02:13:19

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినా ఆ ఇమేజ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన స్వశక్తితో పైకి వస్తున్నాడు ధనుష్. కేవలం నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాణ రంగంలో కూడా తన సత్తా చాటమే కాదు సింగర్ గా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో ధనుష్ పాడిన కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. తాజాగా 'మారి 2'తో నిన్ననే ప్రేక్షకులను పలకరించిన ధనుశ్, ఈ రోజున తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను వదిలాడు. ధనుశ్ తదుపరి చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ తాజా సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విడుదల అయిన ఈ లుక్ లో ధనుష్ నుదుటన నల్లబొట్టు...గార పట్టిన పళ్ళతో చాలా మొరటోడిలా కనిపిస్తున్నాడు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. గత చిత్రాల్లాగే ఈ కాంబినేషన్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.

More Related Stories