English   

తెలుగులో మాయ చేయనున్న ప్రియా వారియర్ !

priya prakash varrier movie oru adaar love  telugu
2018-12-23 12:44:53

స్కూల్ ఏజ్‌లోనే ప్రేమ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్’, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ట్రేడ్ మార్కెట్లో హాటెస్ట్ ఫిలిమ్స్‌లో ఇది ఒకటి. ఈ క్రెడిట్ అంతా ఆ సినిమా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కే దక్కుతుంది. ఎందుకంటే ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. జస్ట్ 28 సెకండ్స్ వీడియోతో ప్రియా ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ వీడియోలో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది. అంతేకాదు 2018 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసిన తర్వాత, దీనిని ఒక్క మలయాళంలోనే కాకుండా హిందీ, తమిళ్, తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక ఈ చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం ప్రియా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ఫిబ్రవరి 14వ తేదీన 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. 

More Related Stories