English   

పారిస్ పారిస్ టీజర్ టాక్ : వామ్మో....కాజల్ ఏనా ?

kajal agarwal's movie paris paris teaser talk
2018-12-23 12:55:06

కాజల్‌ అగర్వాల్ కు తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్‌ తమిళ రీమేక్‌లో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రం హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు క్వీన్‌గా తమన్నా ‘దటీజ్ మహలక్ష్మి’ నటిస్తుండగా కన్నడలో పరుల్ యాదవ్, మలయాళం మంజిమా మోహన్‌లు లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్స్‌ను నాలుగు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేశారు.  ఇక ఈ నాలుగు టీజర్స్‌కు మిశ్రమ స్పందన లభించగా కాజల్ నటించిన ‘పారిస్ పారిస్’ తమిళ్ టీజర్‌కు ఊహించని స్థాయి క్రేజ్ ఏర్పడింది. పారిస్ పారిస్ పేరుతో విడుదలవుతున్న ఈమూవీ టీజర్‌లో గ్లామరస్ లుక్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కాజల్. డిఫరెండ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుండగా.. ఈ టీజర్‌లో ఓ సన్నివేశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీజర్‌లో కాజల్ అగర్వాల్ హద్దులు దాటి రెచ్చిపోయింది. టీజర్‌లో 40 వ సెకండ్ తరువాత వచ్చే విజువల్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఆమె చేసిన పని. కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన ఇల్లీ అవ్రమ్ సడెన్‌గా కాజల్ కుడివైపు వక్షభాగాన్ని గట్టిగా నొక్కడం దానికి కాజల్ అరవడం వీక్షకుల్ని షాక్‌కి గురిచేసింది. తెలుగు, మిగతా భాషల్లోని టీజర్స్‌లో ఇలాంటి సీన్స్ లేకపోయినప్పటికీ తమిళ్ టీజర్‌కు ఈ మసాలా అద్దడంతో పారిస్ పారిస్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. స్టార్ హోదా ఉన్న క్రేజీ హీరోయిన్ ఇలాంటి సన్నివేశంలో నటించడం ఏంటని కొందరు అంటుంటే మిగతా భాషల్లోనే ఈమెనే పెట్టాల్సింది అంటూ కుర్రోళ్ళు సెటైర్లు వేస్తున్నారు. 

More Related Stories