English   

రానా ప్లేస్ లో బెల్లంకొండ....మరో బయోపిక్ !

Bellamkonda Sai Srinivas in biopic movie
2018-12-23 13:08:58

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఎటుచూసినా బయోపిక్ ల వార్తలే. ఇప్పటికే షూటింగ్ పూర్తైన కొన్ని బయోపిక్ లు విడుదలకి సిద్ధమవుతూ వుంటే, మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ బయోపిక్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ దర్శకుడు వంశీకృష్ణ రూపొందించనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. స్టూవర్ట్ పురానికి టైగర్ నాగేశ్వరరావు అప్పట్లో ధనికులను దోచేసి ఆ ధనాన్ని పేదవారికి పంచేవాడని రాబిన్ హుడ్ లా బ్రతికేవాడని చెప్పుకునేవారు. ఈ బయోపిక్ ను ముందుగా నానితో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రానా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ పాత్రకి రానా సరిగ్గా సరిపోతాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రానా కూడా చేయడం లేదనేది తాజా సమాచారం. ఈ కారణంగానే ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిందట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్.. దర్శకుడు వంశీకృష్ణ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అంటాడో లేదో చూడాలి మరి. కెరీర్ లో సరైన హిట్ కొట్టని బెల్లంకొండ నటనా పరంగా కూడా పెద్దగా మార్కులు వేయించుకున్నది లేదు. ‘అల్లుడు శీను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వంశీకృష్ణ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ చిత్రంలో ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి బయోపిక్ అంటే వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకోనుందో మరి.

 

More Related Stories