English   

వ‌చ్చింది గాజుగ్లాస్.. గ‌బ్బ‌ర్ సింగ్ పెంచాలిక ప్ర‌చారం డోస్..

pawan kalyan's janasena party gets glass symbol as elections symbol
2018-12-23 13:21:19

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆయన అభిమానుల్లో ఒక్కటే ఆసక్తి వుంది. జనసేన పార్టీకి ఏ గుర్తు ఇస్తారు అని. ఒకవేళ ఇచ్చినా అది అందరికీ నచ్చుతుందా.. అర్థ‌మ‌య్యేలా ఉంటుందా.. అందుబాటులో ఉంటుందా.. సాధారణ జనానికి చేరుకుంటుందా.. ఇలా ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు అందరి అంచనాలను అందుకుంటూ పవన్ కళ్యాణ్ కు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చింది ఎన్నికల కమిషన్ బోర్డు.  ఇదే విషయాన్ని జనసేన అఫీషియ‌ల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. గాజు గ్లాస్ రావడంపై అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గుర్తు ప్రతీ ఒక్క‌రికి తెలుసు. సాధారణంగా గాజు గ్లాసులు ప్రతి ఛాయ్ బండి ద‌గ్గ‌ర కూడా ఉంటాయి. ఇక ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా తనను తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిగా ఎప్పుడు చెబుతూనే ఉంటాడు. అందుకే గాజు గ్లాస్ రావడంపై ఆయన కూడా ఆనందంగానే ఉన్నాడు.
ఈ గుర్తు అయితే జనాల్లోకి ఈజీగా వెళ్లిపోతుంద‌ని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. గత ఎన్నికల టైంలోనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు. నాలుగేళ్ల తర్వాత పవర్ లో ఉన్న చంద్రబాబుతో పవన్ విడిపోయాడు. ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకొని జనసేనతో సోలోగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు పవన్ కళ్యాణ్. అందుకే ఎన్నికల గుర్తు కోసం అప్లై చేసాడు. ఇన్నాళ్లు ఏ గుర్తు వస్తుంది వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు గాజు గ్లాస్ వచ్చేసిందని తెలిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక పవర్ స్టార్ కూడా సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.

More Related Stories