English   

హీరోయిన్‌ ధన్సికకు గాయాలు...ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Tamil Actress Sai Dhanshika injured in movie shooting
2018-12-23 13:47:19

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాలో ఆయన కుమార్తె యోగిగా నటించి, మెప్పించిన నటి ధన్సిక షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'వాలు జడ' సినిమాతో పాటు, తమిళంలో 'యోగి డా' చిత్రంలో నటిస్తోంది. అయితే తమిళ సినిమా యోగి డా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ బార్ లో ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఫైటింగ్ సీన్ లో భాగంగా ధన్సిక మీదకు బీర్ బాటిళ్లు వరుసగా విసరాలి, ఆ సమయంలో ఓర్పుగా తప్పించుకోవాలి అయితే ఈ సీన్ రిస్క్ కాబట్టి డూప్ తో చేస్తామని దర్శక నిర్మాతలు, ఫైట్ మాస్టర్ చెప్పినప్పటికీ ధన్సిక ఒప్పుకోలేదట. నేనే చేస్తానని డైరెక్ట్ గా రంగంలోకి దిగింది ధన్సిక. అయితే కొన్ని బీర్ బాటిళ్లని బాగానే తప్పించుకున్నప్పటికీ వరుసగా వస్తున్న బాటిళ్లలో రెండు ఒకటికి ఒకటి తగిలి ముక్కలవగా అందులో ఒక ముక్క ధన్సిక కంటికి తగలడం వెంటనే రక్తం కారుతూ ఉండటంతో అప్రమత్తమైన సిబ్బంది ధన్సికని ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద గాయం కాకపోవడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంటనే ఆమె గాయంతోనే తిరిగి షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం.

More Related Stories