English   

బిజినెస్ మాన్ మరో కొత్త బిజినెస్ !

/mahesh babu produce a web series
2018-12-23 14:34:39

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరీ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మాన్ ఎంత పెద్ద సూపర్ హిట్తో అందరికీ తెలుసు. ఎందుకు ఆ టైటిల్ పెట్టాడో కానీ ఇప్పుడు ఆయన నిజంగానే వరుస పెట్టి బిజినెస్ లు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల మహేశ్ సొంతంగా ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టగా, తాజాగా ఆయన వెబ్-సిరీస్ నిర్మాణంలోకి కూడా రానున్నాడట. ఇందుకోసం ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మహేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌లకి మంచి గిరాకీ ఉంది. బాలీవుడ్‌లో అయితే స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. మ‌హేష్ కూడా ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కానీ ఈయ‌న న‌టించ‌దండోయ్ వాటిని నిర్మిస్తాడు. హుస్సేన్ అనే దర్శకుడు ఈ సిరీస్ లను తెరకెక్కిస్తాడని, షూటింగ్ వచ్చే ఏడాది జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. మహేశ్ ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ‘మహేశ్ బాబు ప్రొడక్షన్స్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు వంటి సినిమాలకు మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు.  అయితే ఇప్పుడు వెబ్ సిరీస్‌లు ఇదే నిర్మాణ సంస్థ‌లో చేస్తాడా కొత్త‌ది నెలకొల్పుతాడా అనేది చూడాలి.

More Related Stories