English   

వర్మ సర్వే....సత్యం వైపేనట !

Ram Gopal Varma's movie Lakshmi’s NTR
2018-12-23 21:52:48

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ విడుదల చేసిన ‘వెన్నుపోటు’ వీడియో సీఎం చంద్రబాబును కించపరిచేలా ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలు వర్మ దిష్టి బొమ్మలను దగ్దం చేయడంతో పాటు తెలుగు రాష్ట్రలో చాలా చోట్ల ఆయనపై కేసులు పెట్టారు. ఈ వివాదంపై వేడి తగ్గకుండా ఆ మంటను వర్మ రాజేస్తునే ఉన్నారు. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో మీరు దేని కోసం ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు?’ అని తాను నిర్వహించిన సర్వేలో 50,000 మందికిపైగా పాల్గొనగా అందులో 68 శాతం మంది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకే ఓటేశారని వర్మ త్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి కేవలం 32 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారని ఎక్కడయినా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తమను ఆశీర్వాదించారని వర్మ ఈ రోజు ట్వీట్ చేశారు.

More Related Stories