English   

అనుష్కతో డేటింగ్...ప్రభాస్ చెప్పేశాడుగా !

Prabhas
2018-12-24 04:15:35

ప్రభాస్, అనుష్క జోడీకి 'బాహుబలి' సినిమా నుంచి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ, పెళ్లి చేసుకునే ఆలోచనలో వున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కాఫీ విత్ కరణ్ షో లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు అనగానే అక్కడ ఎఫైర్ విషయమై ఏం చెప్పబోతున్నాడు? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. నిన్న సాయంత్రం కాఫీ విత్ కరణ్ షో తాజా ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో కరణ్ బాహుబలి టీమ్ని పలు ఆసక్తికర విషయాలు అడిగారు. 

ముఖ్యంగా ప్రభాస్ ఎఫైర్ - పెళ్లి గురించి కరణ్ ప్రశ్నించారు. ఎవరినైనా ప్రేమించారా? అని ప్రభాస్ ని ప్రశ్నిస్తే డార్టింగ్ ప్రభాస్ సింపుల్ గా నవ్వేస్తూ `నో` అనేశాడు. అనుష్కతో ఎఫైర్ అంటూ బోలెడంత ప్రచారం సాగుతోంది కదా? అని ప్రశ్నిస్తే కలిసి ఐదేళ్ల పాటు నటించాం. ఆ క్రమంలోనే అలా రూమర్లు వినిపించాయి అని అన్నాడు. నిజం చెప్పాలంటే నాకు అనుష్కకి మధ్య అలాంటిదేం లేదు. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు కావాలంటే రాజమౌళి గారిని అడగండి" అన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ వివరణపై కరణ్ జోహార్ సరదాగా స్పందించారు. 

అనుష్క నీకు బాహుబలిలో భార్యగా, తల్లిగా రెండు పాత్రల్లో నటించింది. ఇది కొంచెం కష్టమే అని కరణ్ జోహార్ తెలిపాడు. ప్రభాస్ స్పందిస్తూ.. అవును.. అలాంటప్పుడు ఆమెతో డేటింగ్ ఎలా చేస్తాను అని ప్రభాస్ తెలిపాడు.  అంతేకాక ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ప్రభాస్ కరణ్ జోహార్ కు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ లో సెక్సియెస్ట్ నటి ఎవరు అని ప్రశ్నించగా అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. అనుష్క, కాజల్, తమన్నా.. ఈ ముగ్గురిలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటావు అని ప్రశ్నించగా.. అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. ఇందులో ఎలాంటి రూమర్ లేదు.. ఆమె నాకు చాలా ఏళ్లుగా స్నేహితురాలు, నటిగా కూడా అనుష్క బెస్ట్. నాకే కాదు రాజమౌళికి కూడా అనుష్కనే ఫేవరేట్ నటి అని ప్రభాస్ తెలిపాడు. ఇంతకీ ఈ షోలో ట్విస్ట్ ఏంటంటే  కాఫీ విత్ కరణ్ షోలో చెప్పేవన్నీ అబద్ధాలేనా? అంటూ రాపిడ్ ఫయిర్ లో ప్రభస్ అడిగిన ప్రశ్నకి ఎస్ అంటూ అసలైన ట్విస్టిచ్చాడు. అంటే అనుష్క గురించి డార్లింగ్ ప్రభాస్ చెప్పినది ఏదీ నిజం కాదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Related Stories