English   

సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న కేజీయ‌ఫ్.. తెలుగులో కూడా.. 

KGF-Telugu
2018-12-24 06:04:15

కొన్ని సినిమాలకు భాషతో పని ఉండదు కేవలం భావంతోనే పని. మన బాహుబలి ప్రపంచానికి తెలిసింది కూడా అలాగే. రీజనల్ సినిమాగా మొదలై ప్రపంచాన్ని గెలిచిన బాహుబలిగా మారిపోయాడు రాజమౌళి. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక బాహుబలి బయలుదేరాడు. ఆ బాహుబలి పేరు కే జి ఎఫ్. కొన్ని సినిమాల‌ను మనకు తెలియకుండానే తక్కువగా అంచనా వేస్తుంటాం. కేజీయ‌ఫ్ కూడా అంతే. కన్నడ సినిమానే కదా అని తక్కువగా అంచనా వేసిన వాళ్ల‌కు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చేస్తున్న ర‌చ్చ చూసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా ఈ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్. తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కే జి ఎఫ్ తొలిరోజు వచ్చిన టాక్ కు మౌత్ ప‌బ్లిసిటీ తోడై మంచి వసూళ్లు రాబడుతోంది. 

పడిపడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలను పూర్తిగా డామినేట్ చేస్తుంది ఈ చిత్రం. తొలిరోజు 60 లక్షలు షేర్ తీసుకొచ్చిన కేజీయ‌ఫ్ ఆ తర్వాత రెండు రోజుల్లో దాదాపు రెండు కోట్లు తెచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. య‌శ్ ఎవరో తెలియక పోయినా కూడా సినిమాలోని ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అదే ఇప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సినిమాను తెలుగులో కూడా హిట్ గా నిలబెడుతుంది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కే జి ఎఫ్ తెలుగులో కనీసం ఆరు కోట్లు షేర్ తీసుకు వచ్చేలా కనిపిస్తుంది. ఇదేగాని జరిగితే ఓ కన్నడ సినిమా ఈ మధ్యకాలంలో తెలుగులో సృష్టించిన అతి పెద్ద సంచలనం ఇదే అవుతుంది. కన్నడ సినిమానే కదా ఏం చేస్తుందిలే అని తక్కువగా అంచనా వేసిన వాళ్ల‌కు ఇప్పుడు ఆ రుచి చూపిస్తున్నాడు య‌శ్. ఎంచ‌క్కా మ‌న సినిమాల‌ను బ‌జ్జోపెట్టి తాను మాత్రం దూసుకుపోతున్నాడు య‌శ్. 

More Related Stories