English   

సిగ్గా...నాకా....ఆ ఆలోచనే లేదుగా ?

disha patani responds about her photoshoots
2018-12-24 18:35:43

దిశా పటాని ఈ మధ్య బరి తెగించి మరీ ఇన్నర్ వేర్ తో ఎక్సపోజ్ చేస్తూ ఒక కంపెనీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది. కొన్ని రోజుల నుండీ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్టు చేసి కలకలం రేపిన దిశా పటానీ, ఆ ఫోటో షూట్ గురించి తన మనసులోని మాటలు చెప్పేసింది. హీరోయిన్‌ గా అవకాశాలు రావాలంటే, ఇటువంటి ఫోటో షూట్లు తప్పనిసరని అంది. ఫోటోలు దిగుతుంటే, కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారని, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుందని చెప్పింది. ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని అంటోంది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ ఫీల్డ్‌ లోకి రాకూడదని అన్నీ తెలిసిన అనుభవజ్ఞురాలి లాగా పాఠాలు చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని జూనియర్లకు సలహా ఇస్తోంది దిశా పటానీ సిగ్గు లేదట

More Related Stories