English   

ఎన్టీఆర్ నెంబర్ వన్ అట...ప్రభాస్ కామెంట్స్ !

prabhas says tollywood no.1 actor is jr ntr
2018-12-24 19:44:01

హీరోల్లో ఎవరు బాగా నటిస్తారు, అలా వారి నటనను బట్టి ర్యాంక్ లు ఇవ్వడం మామూలు విషయంకాదు. ఈ విషయంలో ఏం మాట్లాడినా అది చాలామంది మనోభావాలని దెబ్బతీసే అవకాశం ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఏకంగా నలుగురు హీరోలకు ర్యాంక్ లు ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లో తారక్ కు నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు ప్రభాస్. అసలేమైఁదంటే ప్రభాస్ రానా, రాజమౌళిలతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు ఈ సమయంలో ప్రభాస్ ను ఇరకాటంలో పెట్టేలా కరణ్ జొహార్ ఒక ప్రశ్న అడిగారు. "టాలీవుడ్ లోని మిగతా హీరోల్లో ఉత్తమ నటుడిగా వీరిలో ఎవరిని భావిస్తావు?" అంటూ ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ పేర్లను కరణ్ వరుసగా చెప్పారు. సాధారణంగా ఈ ప్రశ్నకి ఇంకెవరైనా అయితే 'అందరూ మంచి నటులే' అనే సమాధానమిస్తారు. కానీ ప్రభాస్ ఎంతమాత్రం తడుముకోకుండా ఎన్టీఆర్ కి మొదటి స్థానం ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత స్థానాల్లో మహేశ్ బాబు బన్నీ .. చరణ్ ఉంటారని అన్నాడు.

More Related Stories