English   

నాని మారిపోయాడు.. మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు..

mahi raghavs next movie vishal and nani multi star
2018-12-24 20:01:12

తగిలిన దెబ్బనే చూస్తూ కూర్చుంటే నొప్పి తప్ప ఇంకేం రాదు. దానికి మందు రాసి మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు నాని చేస్తుంది కూడా అదే. దేవదాస్ ఫ్లాప్ తర్వాత వరస సినిమాలు చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. రెండు ఫ్లాపులు వచ్చాయి కదా బ్రేక్ తీసుకుంటాడేమో అనుకున్న వాళ్ల ఆలోచ‌న‌ల‌కు బ్రేక్ ఇస్తూ మూడు నాలుగు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విక్రమ్ కె.కుమార్ సినిమా కూడా ఫైనల్ చేశాడు నాని. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పట్టాలెక్కనుంది. ఈ సినిమా పూర్తి కాగానే మరో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వైపు నాని అడుగులు పడుతున్నాయి. ఈ సారి తమిళ హీరో విశాల్ తో కలిసి నటించబోతున్నాడు ఈ హీరో. యాత్ర సినిమా దర్శకుడు మహీ వి రాఘవ చెప్పిన కథ నచ్చడంతో ఈ మల్టీస్టారర్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
విశాల్ కూడా ఈ కథకు బాగానే ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఆయన కూడా తమిళనాట వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దానికి తోడు ఈ మధ్య వివాదాల్లోనూ బాగానే ఇరుక్కుంటున్నాడు విశాల్. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత నాని సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఇక నాని కూడా జెర్సీతో పాటు విక్రమ్ కె.కుమార్ సినిమాను పూర్తిచేసి విశాల్ మల్టీస్టారర్ పై దృష్టి పెట్టనున్నాడు. దర్శకుడు మహి అయితే ప్ర‌స్తుతం త‌న ధ్యాసంతా యాత్ర సినిమాపైనే ఉంచాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 8న విడుదల కానుంది. ఆ తర్వాత మల్టీస్టారర్ కథపై ఫోకస్ చేయనున్నాడు. నాగార్జునతో కలిసి నటించిన దేవదాసు ఫ్లాప్ అయినా కూడా మరోసారి మల్టీస్టారర్ వైపు ధైర్యంగా అడుగులేస్తున్నాడు న్యాచురల్ స్టార్. మరి ఈయన నమ్మకాన్ని మహి ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.

More Related Stories