English   

ర‌వితేజ‌కు ఆ నిర్మాత‌ల‌తో ప‌డ‌టం లేదా..?

raviteja disagreement with mytri movie makers
2018-12-24 13:12:08

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే హీరో రవితేజ. హాయిగా తన పనేదో తాను చేసుకుంటూ.. తన సినిమాలు తను చూసుకుంటూ కుటుంబంతో గడిపేస్తుంటాడు ఈ మాస్ రాజా. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు మ‌రి రవితేజ బాగా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ముఖ్యంగా పారితోషికం విషయంలో రవితేజ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈయన పారితోషికం విషయంలో నిర్మాతల దగ్గర ఖరాకండిగా ఉంటాడని.. డబ్బులు ఇవ్వకపోతే సినిమాలు పూర్తి చేయడ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ విషయంలో కూడా రవితేజకు ఇలాంటి విభేదాలు ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య ఈ నిర్మాణ సంస్థలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేశాడు రవితేజ. శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా ఆల్టైమ్ డిజాస్టర్ అయిపోయింది.
దాంతో రవితేజతో కుదుర్చుకున్న మూడు సినిమాలు ఒప్పందం నుంచి మైత్రి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. కానీ రవితేజ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. తనకు రెండు సినిమాల పారితోషం ఇస్తే కానీ మూడు సినిమాల డీల్ నుంచి బ‌య‌టికి రాను అనే కండీష‌న్ పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తమిళనాట హిట్టయిన తేరి సినిమా రీమేక్ రవితేజతో ప్లాన్ చేశారు. దీనికోసం ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ క‌థ కూడా సిద్ధం చేసాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి వెనకడుగు వేస్తుంది మైత్రి మూవీ మేకర్స్. రవితేజ మాత్రం పారితోషికం విషయంలో పట్టుబట్టడంతో మైత్రికి మాస్ రాజాకు మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నాయనే టాక్ ఇండ‌స్ట్రీలో జోరుగా న‌డుస్తుంది. మరి ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఎప్ప‌టికి స‌మ‌సిపోతాయో చూడాలి.

More Related Stories