English   

అయ్య‌య్యో.. షారుక్ ఖాన్ మ‌ళ్లీ జీరో అయిపోయాడే..

Shah Rukh Khan, Anushka Sharma's movie zero collections
2018-12-24 20:18:11

కొన్నిసార్లు టైటిల్స్ చూసినప్పుడే సినిమా భవిష్యత్తు ఏంటో అర్థం అయిపోతుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ని చూస్తే అదే అనిపిస్తుంది. ఈయ‌న‌ నటించిన జీరో నిజంగానే జీరో అయిపోయింది ఇప్పుడు. బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకొని షారుక్ ఖాన్ కెరీర్లో అత్యంత దారుణమైన పరాజయంగా మిగిలిపోవ‌డానికి సిద్ధ‌మైంది జీరో సినిమా. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మరుగుజ్జుగా నటించాడు షారుక్ ఖాన్. సాగదీసిన స్క్రీన్ ప్లే, పాత కథ జీరోను ప్రేక్షకులకి దూరం చేశాయి. తొలి రోజు కేవలం 20 కోట్లతో సరిపెట్టుకొని కే జి ఎఫ్ సినిమా ముందు ఓడిపోయింది జీరో. ఈ మధ్య కాలంలో కింగ్ ఖాన్ సినిమాలు ఎప్పుడు ఇంత తక్కువ ఓపెనింగ్స్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అన్ని విచిత్రాలు జీరో సినిమాకే జరుగుతున్నాయి. మూడు రోజులు దాటిన తర్వాత కూడా వసూళ్ళు 60 కోట్లు పైగా కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు తక్కువగా ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఇప్పుడు జీరో అదే చేసి చూపిస్తుంది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయారు. షారుక్ ఖాన్ కూడా జీరో పరాజయాన్ని ఇన్ డైరెక్టుగా ఒప్పుకున్నాడు. తాను ఇమేజ్ అనే ముసుగులో పడిపోయి సహజత్వానికి దూరంగా ఉన్నానేమో అనిపిస్తుందని.. అందుకే ఈ మధ్య కాలంలో తన సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదని చెప్పాడు షారుక్ ఖాన్. ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షారుక్ మళ్లీ ఫామ్ లోకి రావడం కష్టం. ఆ అద్భుతం చేసే దర్శకుడు కోసమే ఇప్పుడు కింగ్ కాంగ్ కళ్ళు వెతుకుతున్నాయి. మరి ఆ దర్శకుడు ఎక్కడున్నాడు.. షారుక్ ఖాన్ కు మళ్లీ గోల్డెన్ డేస్ తీసుకువచ్చే అద్భుతమైన సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. అప్పటివరకు కింగ్ ఖాన్ అభిమానులకు ఈ ఎదురుచూపులు తప్పవు.

 

More Related Stories