English   

కేజియ‌ఫ్ ను గాలికి వ‌దిలేసిన పిఆర్ఓ..

SURESH KONDETI PRO OF KGF MOVIE
2018-12-24 20:25:12

పి ఆర్ ఓ బాధ్యత ఏంటి.. ఓ సినిమా వదిలినప్పుడు దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం.. అదే క‌దా పిఆర్ఓ డ్యూటీ. కానీ తెలుగులో కొందరు పిఆర్ఓలు మాత్రం తమకు నిర్మాతల నుంచి డబ్బు తీసుకోవడం తెలుసు.. కానీ హిట్ సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడానికి తెలియడం లేదు. వాళ్లు డబ్బులు తీసుకున్న కూడా సినిమా ఎలా పోతే మాకేంటి అని చేతులు దులిపేసుకుంటున్నారు. కనీసం మీడియా షో కూడా వేయ‌కుండా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఈమధ్య కేజిఎఫ్  అనే కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి మౌత్ పబ్లిసిటీ తోనే కలెక్షన్స్ రాబడుతుంది.
తొలి రోజు నుంచి సినిమాపై ఉన్న అంచనాలు దృష్ట్యా.. ఈ మధ్య కాలంలో ఏ కన్నడ సినిమాకు సాధ్యం కాని రీతిలో అద్భుత‌మైన వ‌సూళ్లు తీసుకొస్తుంది కేజియ‌ఫ్. అయితే కేజిఎఫ్ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసిన పిఆర్ఓ మాత్రం పూర్తిగా దీన్ని గాలికి వ‌దిలేసాడు. ఈ సినిమాకు అఫీషియల్ పిఆర్ గా ఉన్న సురేష్ కొండేటి తెలుగులో ప్రమోషన్ బాధ్యతలు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఈయ‌న తీరుపై మీడియా వ‌ర్గాలు కూడా గుర్రుగానే ఉన్నాయి. కేవలం ప్రేక్షకులే సినిమాను చూసి బాగుందంటూ మౌత్ పబ్లిసిటీ తో క్రేజ్ పెంచుతున్నారు. ఈ విషయంలో పిఆర్ సురేష్ కొండేటి కంటే ప్రేక్షకులే పిఆర్ఓ లుగా మారిపోయారు.
నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని కూడా తెలుగులో సినిమాలో సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతే.. ఒక్కోసారి తెలియకుండానే మంచి సినిమాలు చచ్చిపోతాయి. ఇప్పుడు కేజిఎఫ్ కూడా అంతే. తెలుగులో తొలి రోజు నుంచే మంచి ప్రమోషన్ చేసి ఉంటే కలెక్షన్లు ఇంకా బాగా వచ్చుండేవి అంటున్నారు విశ్లేష‌కులు. అలా కాకుండా కేవలం తాము మాత్రమే సొమ్ము చేసుకొని సినిమాలు గాలికి వదిలేస్తే ఒక్కోసారి తెలియకుండానే చాలా మంచి సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. మొత్తానికి పిఆర్ఓలు అప్పుడప్పుడు సొంత లాభంతో పాటు సినిమా లాభం కూడా చూస్తే బాగుంటుందని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు.

More Related Stories