English   

దిల్ రాజు ఇంట పెళ్ళిసంద‌డి..

DIL RAJU BROTHER SON  WEDDING RECEPTION
2018-12-24 13:34:53

రాజుగారి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. దాంతో ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా అక్క‌డే ఉన్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు హరీష్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోనే జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్ష‌న్ కు తెలుగు ఇండస్ట్రీతో పాటు రాజకీయ ప్రముఖులు చాలా మంది వచ్చారు. దిల్ రాజుకు తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న పాపులారిటీ కార‌ణంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు హ‌రీష్ రెడ్డి రిసెప్షన్ లో కనిపించారు. హీరోలు, హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులతో ఆ వేదిక అంతా సందడిగా మారిపోయింది. మహేష్ బాబు, కొరటాల శివతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, కమెడియన్లు అందరూ దిల్ రాజు వేడుకలో ద‌ర్శ‌న‌మిచ్చారు. నవ దంపతులను కలిసి తమ ఆశీర్వాదాలు తెలియజేశారు.
ఇదిలా ఉంటే దిల్ రాజు సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తుంటారు వ‌రుడు హరీష్ రెడ్డి. ఆ మధ్య రాజ్ తరుణ్ హీరోగా లవర్ సినిమాను నిర్మించింది ఈయనే. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ బాబాయ్ కి తోడుగా నిలుస్తున్నాడు హరీష్ రెడ్డి. దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే 2018 అంతగా కలిసి రాలేదు. అందుకే ఆ బాకీ వచ్చే ఏడాది తీర్చుకోవాలని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. సంక్రాంతికి ఎఫ్ 2తో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు దిల్ రాజు. గతంలో ఈయ‌న నిర్మించిన ఎవడు, శతమానంభవతి సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం సాధించాయి. ఇప్పుడు అదే నమ్మకంతో ఎఫ్ 2 సినిమాను తీసుకొస్తున్నాడు దిల్ రాజు. దాంతో పాటు మహేష్ బాబు మహర్షి సినిమా కూడా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఓ వైపు వారసుడు పెళ్లి.. మరోవైపు సినిమాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు ఈ అగ్ర నిర్మాత.

More Related Stories