English   

పేట సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?

Rajinikanth’s Petta movie censor report
2018-12-24 20:40:54

రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈయ‌న నటిస్తున్న పేట సినిమా సెన్సార్ పూర్తి అయిపోయింది. దీనికి యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో పేట సినిమాను నిర్మించింది. ఇందులో పగటిపూట హాస్టల్ వార్డెన్ గా.. రాత్రిపూట మాఫియా డాన్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు రజినీకాంత్. 2.0, కాలా సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో ముందు నుంచి పేట సినిమాపై పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ అనిరుద్ పాటలు.. టీజర్ విడుద‌ల అయిన త‌ర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని అందుకునే పనిలో బిజీగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. పైగా ఈయన కెరీర్ కు కూడా పేట సినిమా కీలకంగా మారింది.
చాలా సంవత్సరాల తర్వాత తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో పడ్డాడు రజినీకాంత్. తమిళనాట త‌న‌కి పోటీగా మరో హీరో రాలేడు అనుకున్న సమయంలో విజయ్ వరస విజయాలతో దూసుకొస్తున్నాడు. దాంతో పేట సినిమాతో హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుని.. ఎప్పటికీ నెంబర్ వన్ త‌నే అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. 2.0 సినిమా 800 కోట్లు వసూలు చేసినా కూడా సేఫ్ జోన్ కి రాలేక పోయింది. ఈ సినిమా బిజినెస్ 1,100 కోట్ల మేర జరిగింది.. దాంతో ఇప్పటివరకు మరో 200 కోట్లు వెనుకబడే ఉంది 2.0.
తమిళనాట అయితే వంద కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు కేవలం 70 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇంకా 30 కోట్లు బాకీ ఉండడంతో ఈ సినిమాను కమర్షియల్ గా ఫ్లాప్ అని తేల్చేశారు విశ్లేషకులు. కొచ్చాడయాన్, లింగా, క‌బాలి, కాలా, 2.0.. ఇలా ఈ మధ్య కాలంలో రజినీకాంత్ చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేదు. దాంతో ఇప్పుడు పేట‌ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మొత్తానికి మరి సంక్రాంతికి పేట ఏం చేస్తుందో చూడాలి. అన్నట్లు తెలుగులో రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ లతో పోటీ పడబోతున్న‌ రజనీకాంత్.. తమిళనాట అజిత్ విశ్వాసం సినిమాతో స‌మ‌రానికి సై అంటున్నాడు.

More Related Stories