English   

నితిన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వెంకీ కుడుముల‌..

NITHIIN BHEESHMA MOVIE
2018-12-24 20:46:22

చలో సినిమా వ‌చ్చి అప్పుడే 10 నెల‌లు దాటిపోయింది. ఇప్పటి వరకు వెంకీ కుడుముల రెండో సినిమా ఎందుకు మొదలు పెట్టలేదు.. నితిన్ తో సినిమా కన్ఫర్మ్ అయినా కూడా ఇప్పటి వరకు భీష్మ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు.. దీనికి ఆ దర్శకుడు నుంచే క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా మొదలు పెట్టనున్నట్లు వెంకీ కుడుముల‌ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే భీష్మ కథ పూర్తి అయిపోయిందని.. అయితే నితిన్ కు భుజం గాయం కారణంగా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నాడని.. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత భీష్మ సినిమా పట్టాలు ఎక్కనుందని చెప్పాడు వెంకీ కుడుముల‌.
జనవరి లేదంటే ఫిబ్రవరి నుంచి భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఇందులో పెళ్లి అంటే పడని యువకుడిగా నితిన్ నటించబోతున్నాడు. చలో ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్. గతంలో నితిన్ హీరోగా వ‌చ్చిన అ..ఆ సినిమాను నిర్మించిన రాధాకృష్ణ త‌న రెండో నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న‌ ఈ సినిమాపై నితిన్ కెరీర్ ఆధారపడి ఉంది. అస‌లే హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో ఉన్నాడు నితిన్. అ..ఆ త‌ర్వాత వ‌చ్చిన లై, ఛ‌ల్ మోహ‌న్ రంగా, శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇప్పుడు నితిన్ కెరీర్ కు భీష్మ సినిమా ఊపిరిగా మారింది.

 

More Related Stories