English   

పవన్ పార్టీకి అన్న, కొడుకు భారీ విరాళం ! 

Pawan-kalyan
2018-12-25 10:50:46

జనసేన పార్టీకి మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. నాగబాబు రూ.25 లక్షలు ప్రకటించగా, వరుణ్ తేజ్ రూ.కోటి రూపాయలను విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ తెలిపారు. 'జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్ లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాగబాబు గారు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ కోటి రూపాయల వంతున పార్టీకి విరాళం అందజేశారని  తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాగబాబు, వరుణ్ తేజ్ లు అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నా' అని పవన్ తన పేర్కొన్నారు. ఈ క్రిస్ట్‌మస్ పండుగకు వారి నుంచి సర్‌ప్రైజ్ రావడం సంతోషంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆయన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజెనోవాతో కలిసి యూరప్ వెళ్లారు. యూరప్ పర్యటన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే నాగబాబు, వరుణ్‌తేజ్‌ను కలుస్తానని ఆయన ట్వీట్ చేశారు.

More Related Stories