English   

భార్య‌ల కోసం కోట్లు త్యాగం చేసిన చ‌ర‌ణ్, బ‌న్నీ.. 

Charan-Allu-Arjun
2018-12-25 04:41:25

విన‌డానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పటి హీరోలు సినిమాలకు ఎంత వ్యాల్యూ ఇస్తున్నారో.. యాడ్స్ కూడా అంతే విలువ ఇస్తున్నారు. ఎన్ని ఎక్కువ యాడ్ చేస్తే తమకు అంత క్రేజ్ ఉందని ఫిక్స్ అయిపోతున్నారు స్టార్ హీరోలు. అందుకే వచ్చిన ఏ ఆఫ‌ర్ ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు. ఓ కార్పొరేట్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ను ఇద్దరు హీరోలు వదిలేసుకున్నారనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా జరుగుతుంది. ఈ మెగా హీరోల క్రేజ్ వాడుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ కంపెనీకి ఆశాభంగం ఎదురైంది. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా అల్లు అర్జున్. రామ్ చరణ్ యాడ్ ఒప్పుకోక పోవడం వెనుక ఒక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే ఈ యాడ్లో చరణ్, బన్నీ నటించాల్సింది సోలోగా కాదు.. వాళ్ళ భార్యలతో. అల్లు అర్జున్-స్నేహారెడ్డి, రామ్ చరణ్-ఉపాసన.. ఈ జంటల్లో ఎవరో ఒకరితో యాడ్ షూట్ చేయాలని ప్లాన్ చేసింది స‌ద‌రు కార్పొరేట్ కంపెనీ. 

భార్యలతో తెరపై కనిపించడం ఇష్టంలేని మెగా హీరోలు ఇద్దరు ఈ ఆఫర్ ను సున్నితంగా వదిలేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చరణ్, బన్నీ కాదనడంతో ఇప్పుడు ఈ ఆఫర్ నాగచైతన్యకు వెళ్లిందని తెలుస్తోంది. సమంతతో కలిసి త్వరలోనే ఈ యాడ్లో నటించబోతున్నాడు చైతూ. సాధారణంగా బాలీవుడ్ లో ఈ స్టార్ కపుల్స్ యాడ్స్ చేస్తుంటారు. అక్కడ షారుక్ ఖాన్-గౌరీ ఖాన్, అమీర్ ఖాన్- కిరణ్ రావు, సైఫ్ అలీఖాన్-కరీనా కలిసి నటించారు. ఇదే ట్రెండ్ తెలుగులో కూడా తీసుకురావాలని మెగా హీరోల కోసం గేలం వేశాయి కార్పొరేట్ కంపెనీలు. కానీ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి నాగచైతన్య, సమంతతో పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి కోట్ల ఆఫర్ వదులు కోవడం అంటే మాటలు కాదు.. ఈ విషయంలో మెగా హీరోల సాహ‌సం మెచ్చుకొని తీరాల్సిందే.

More Related Stories