English   

క్రిస్మ‌స్ గిఫ్ట్.. పూరీ, రామ్ సినిమా అనౌన్స్ మెంట్.. 

Ram
2018-12-25 06:06:55

అనుకున్నదే జరిగింది. కాస్త ఆలస్యమైనా పూరి జగన్నాథ్, రామ్ సినిమా క్రిస్మస్ కానుకగా మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుందని చెప్పారు పూరి జగన్నాథ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు దర్శకనిర్మాత పూరి. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో న‌టించే హీరోయిన్ పై క్లారిటీ ఇవ్వలేదు కానీ బాలీవుడ్ భామ ఇందులో రామ్ తో రొమాన్స్ చేయబోతుందని తెలుస్తోంది. మెహబూబా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న పూరి.. ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. రామ్ సినిమాతో కచ్చితంగా మళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాన‌ని ధీమాగా చెబుతున్నారు ఈ డేరింగ్ డైరెక్టర్. మరోవైపు రామ్ కూడా పూరి క‌థ‌తో పూర్తిగా కనెక్ట్ అయిపోయాడు. ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయాడు ఎనర్జిటిక్ స్టార్. ఎప్పటిలాగే తన స్టైల్లో సినిమాను కేవలం 5 నెలల్లోనే పూర్తి చేసి మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్. రామ్ సినిమాకు చార్మి కూడా ఓ నిర్మాతగా ఉండటం విశేషం. మొత్తానికి మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలాంటి సృష్టించబోతుందో చూడాలి.

More Related Stories