English   

మా ఆవిడ బాగా నటించిందన్న పాపానికి ఆడుకుంటున్నారుగా !

anushka
2018-12-25 14:50:44

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 'జీరో' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సినీ ప్రేక్షకుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వచ్చింది. తొలి వీకెండ్ నాటికి 60 కోట్ల వసూళ్లను సాధించింది. దాదాపు 4400 స్క్రీన్ల నుంచి దక్కిన వసూళ్లు ఇవి. అయితే షారూక్ స్థాయికి తగ్గ వసూళ్లు కావన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్న నటీనటుల బృందం జీరో గురించి ఊదరగొట్టేసింది. కత్రిన ఈ చిత్రంలో రియల్ లైఫ్ పాత్ర పోషించగా అనుష్క శర్మ సెరిబ్రల్ పార్శీ అనే రుగ్మతతో బాధపడే యువతిగా నటించింది. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోయే మరుగుజ్జుగా షారూక్ నటించారు. జీరో చిత్రంలో అనుష్క శర్మ నటన గురించి పొగిడేస్తూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రోజుల క్రితం చిత్రాన్ని చూసి ట్విట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. జీరో సినిమా చూసి ఎంజాయ్ చేశాను. చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంసించారు. ముఖ్యంగా త‌న భార్య అనుష్క శ‌ర్మ ఎంచుకున్న పాత్ర‌లో న‌టించ‌డం చాలా క‌ష్ట‌మ‌న‌వి అమె గొప్ప‌గా న‌టించింద‌ని కొనియాడాడు. దీనిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.  

More Related Stories