English   

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా...వీవీఆర్ కోసం !

Ram-charan
2018-12-25 15:12:45

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకుడిగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న 'వినయ విధేయ రామ' చిత్రం విడుదలకి సిద్దమవుతోంది. కథానాయికగా కైరా అద్వాని కనువిందు చేయనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేసింది యూనిట్. ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 

జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషన్ లేదు కానీ …ఒకే ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. అదేమిటంటే..ఈ సినిమాలో చివరి సాంగ్ ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఏ పాటకు ఖర్చుపెట్టనంత భారీ మొత్తం పెడుతున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చివరి పాట షూటింగ్ కూడా మొదలైందట. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఖానాపూర్‌లో ఒక భారీ సెట్‌ను ఇప్పటికే నిర్మించారట. ప్రస్తుతం ఆ సెట్‌లోనే చివరి పాట షూటింగ్ జరుగుతోందని తెలిసింది. ఈ పాట భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే దాదాపు 800 మంది డ్యాన్సర్లు ఈ పాటలో చరణ్‌తో కలిసి స్టెప్పులేస్తారట. ఈ పాట సినిమా మొత్తం మీద హైలైట్‌గా నిలుస్తుందని తెలిసింది. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహా ప్రశాంత్ లు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో, చరణ్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

More Related Stories