English   

త్రిషతో డేటింగ్‌ చేశాను కానీ...బ్రేకప్ !

Rana-Daggubati
2018-12-25 15:32:21

సరిగ్గా ఏడాదిన్నర క్రితం అనుకుంటా సింగర్ సుచిత్రా కార్తీక్ ట్విట్టర్ వ్యవహారం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిస్న్దే. అప్పడు రానా తన్మయత్వంతో తమిళ బ్యూటీ త్రిష బుగ్గని ముద్దాడుతున్న ఫోటో తెగ హల్చల్ చేసింది. కేవలం సరదాకి ఫోటో తీయించుకోవడం వేరు. ఈ ఫోటో వేరు. వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందొ, త్రిషని రానా ఎంత తన్మయంతో ముద్దాడాడో ఆ ఫోటో చూస్తే అర్ధమైపోతుంది. అదే సమయంలో క్రితం త్రిష-రానాల వ్యవహారం పెళ్లి దాకా వచ్చేసినంత హడావుడి జరిగింది. కానీ త్రిషకు వేరే ఎంగేజ్మెంట్ కాన్సిల్ క్కూడా అయ్యింది. అప్పటి సంగతిని ఎవరూ ఖండించకపోయినా ఆ విషయం మరుగున పడింది. 

తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి హీరోలు ప్రభాస్, రానాతో పాటు దర్శకుడు రాజమౌళి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంటె ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కరణ్ యత్నించాడు. ప్రోగ్రామ్ లో భాగంగా ప్రభాస్, రానాలను పెళ్లి విషయమై కరణ్ ప్రశ్నించాడు. మీరు ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని కరణ్ రానాను అడిగాడు. దీంతో రానా ‘లేదు నేను ఇంకా సింగిల్ గానే ఉన్నా’ అని జవాబిచ్చాడు. 

దీంతో వెంటనే కరణ్ త్రిషతో గతంలో రానా ప్రేమాయణం విషయాన్ని ప్రస్తావించాడు. దీనిపై రానా స్పందిస్తూ..‘త్రిష, నేను మంచి స్నేహితులం. తను నాకు పదేళ్ల నుంచి తెలుసు. కొంతకాలం మేమిద్దరం డేటింగ్ కూడా చేశాం, కానీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పాడు. సరైన సమయం వస్తే పెళ్లి దానంతట అదే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా రానా పెళ్లిపై రాజమౌళి మాట్లాడుతూ రానా ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నాడనీ, ఏ వయసులో ఏది చేయాలో అది చేస్తాడని అన్నారు. 

More Related Stories