English   

రాజ‌మౌళిని బాహుబ‌లి భ‌య‌పెట్టిన వేళ‌..

Rajamouli
2018-12-25 10:43:05

బాహుబలి తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకు కూడా కొత్త అర్థాలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలన్నీ పక్కన పెట్టి కొత్త లెక్కలు నేర్పించిన చిత్రం బాహుబలి. మరి ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు చూసే ప్రేక్షకులకే అంత‌ టెన్షన్ గా ఉంటే.. తీసే రాజమౌళికి ఇంకెంత టెన్ష‌న్ ఉండాలి..? అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా ఊహించని బడ్జెట్తో బాహుబలి వచ్చింది. అలాంటి సినిమా విడుదల అవుతున్న రోజు బాహుబలి యూనిట్ ఎంత టెన్షన్ పడి ఉండాలి..? ఇప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉందో కాఫీ విత్ కరణ్ షోలో పంచుకున్నాడు రాజమౌళి. బాహుబలి విడుదలైన తొలి రోజు టీమ్ అంతా ఢిల్లీలో ఉన్నామ‌ని గుర్తు చేసుకున్నాడు రాజమౌళి. ఆరోజు ఇంకా తనకు గుర్తుందని.. నార్త్, తమిళనాడులో సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చినా కూడా ప్ర‌ధాన‌మైన‌ తెలుగులో మాత్రం డివైడ్ టాక్ రావడంతో టెన్షన్ ప‌డ్డామ‌ని చెప్పాడు ద‌ర్శ‌క‌ధీరుడు. 

ఆ టాక్ విని ప్రభాస్ అయితే ఢిల్లీ వదిలి హైదరాబాద్ కూడా రాలేదని నవ్వుకున్నాడు దర్శకధీరుడు. ఎందుకో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు తమ నుంచి బాహుబలి కంటే ఎక్కువ ఊహించార‌ని ఒప్పుకున్నాడు రాజ‌మౌళి. వాళ్లు ఆశించిందేదో తాము ఇవ్వ‌లేద‌ని అని కంగారు ప‌డ్డట్లు చెప్పాడు రాజమౌళి. అయితే తాము తీసిన సినిమాపై నమ్మకం ఉందని.. అదే రోజు సాయంత్రానికి టాక్ మొత్తం మారిపోయిందని చెప్పాడు జ‌క్క‌న‌. మూడు రోజుల తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ డిసైడ్ అయిపోయినట్లు చెప్పాడు దర్శక ధీరుడు. కానీ తొలిరోజు వినిపించిన టాక్ మాత్రం తనను భయపెట్టడం కాదు వ‌ణికించింద‌ని మరోసారి గుర్తు చేసుకున్నాడు జక్కన్న. 

ఇక ప్రభాస్ అయితే బాహుబలి నెగిటివ్ టాక్ పై మరోలా స్పందించాడు. మార్నింగ్ షో పడినప్పుడు తాను పడుకొని ఉన్నానని.. ఒకవేళ సినిమాకు మంచి టాక్ రాకపోతే త‌న‌ను నిద్ర లేపవద్దని చెప్పినట్టు చెప్పాడు ప్రభాస్. అందుకే తన ఫ్రెండ్స్ కూడా త‌న‌ను నిద్ర లేప‌లేదని.. అప్పుడే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని తనకు కూడా అర్థం అయింద‌ని చెప్పాడు యంగ్ రెబల్ స్టార్. కానీ మూడు రోజుల తర్వాత సీన్ అంతా మారిపోయింది. బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. బాహుబలి 2 వచ్చి రెండు వేల కోట్లు కొల్లగొట్టింది. ఇదంతా ఇప్పుడు చెప్పి కాఫీ విత్ కరణ్ షోలో నవ్వుకున్నారు బాహుబలి టీం.

More Related Stories