English   

జాయింట్ గా రెమ్యునరేషన్ కొల్లగొట్టారు !

samantha
2018-12-25 11:35:41

ఏం మాయ చేశావే సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన అకౌంట్ లో వేసుకొని రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నాగ చైతన్య ని మాయ చేసి తనవాడ్ని చేసుకుంది. దాదాపు 7 సంవత్సరాలు ప్రేమించుకొని ఆ ఏడూ సంవత్సరాలలో దాదాపు నాలుగు ఐదు సినిమాలో కలిసి నటించారు నాగచైతన్య, సమంత. ఇప్పటికి పెళ్లి అయ్యి ఏదాటి అయిపోయింది కానీ ఈ ఏడాదిలో ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు, పెళ్లి తరువాత మొట్టమొదటి సినిమా నిన్నుకోరి ఫెమ్ శివ దర్శకత్వం లో ‘మజిలి’ అనే సినిమా చేస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి అప్పుడప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాడు శివ. తాజాగా ఇందులో వీళ్ళకు రెమ్యునరేషన్లకి సంబంధించి బయటకు వచ్చిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మాత సాహు గారపాటి కాంబో ఆఫర్ లో ఇద్దరికీ కలిపి 6 కోట్ల 60 లక్షల జాయింట్ రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇచ్చారని తెలిసింది. ఇది భార్యభర్తల కథే అయినప్పటికీ అదిరిపోయే లవ్ స్టొరీ ఉంటుందట.

వైజాగ్ పరిసరాల్లో అధిక శాతం షూటింగ్ జరుపుకున్న మజిలి  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Related Stories