English   

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో పూర్తి న‌టుల జాబితా ఇదే..

NTR-Biopic
2018-12-25 12:03:37

ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసమే దర్శకుడు క్రిష్ ఇప్పుడు పండగ లాంటి కబురు చెప్పాడు. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారు అని ఓ లిస్ట్ రిలీజ్ చేశాడు క్రిష్. నమ్మడానికి కూడా వీలులేని విధంగా కనీసం 50 మంది నటులతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. ఇప్పుడు వాటి వివరాలు పూర్తిగా మీడియాకు ఇచ్చాడు క్రిష్. ఈ లిస్టు చూసిన తర్వాత ఒక్క క్షణం గుండె ఆగిపోవడం ఖాయం. ఇందులో బాలకృష్ణ అన్న ఎన్టీఆర్ పాత్ర‌లో నటిస్తున్నాడు. ఇక ఆయన భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్.. అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి.. కొడుకు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. 

అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్.. శ్రీదేవి గా రకుల్.. నాగిరెడ్డి గా ప్రకాష్ రాజ్.. నందమూరి త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా క‌నిపిస్తున్నారు. లోకేశ్వరిగా పూనమ్ బాజ్వా.. భువనేశ్వరి గా మంజిమ మోహ‌న్.. నందమూరి సాయికృష్ణగా గారపాటి శ్రీనివాస్.. పురందేశ్వరి మ‌హ‌న్షి.. ఉమామహేశ్వరి పాత్ర‌లో కోమలి.. నందమూరి రామకృష్ణ గా రోహిత్ భ‌ర‌ద్వాజ్ న‌టిస్తున్నారు. చక్రపాణిగా మురళీశర్మ.. లెజెండ‌రీ ఎల్.వి.ప్రసాద్ గా జిస్సు సేన్ గుప్తా క‌నిపిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీల‌క పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు పాత్ర‌లో మ‌రాఠీ న‌టుడు సచిన్ ఖేద్ క‌ర్ న‌టిస్తున్నాడు.
 
ఆదుర్తి సుబ్బారావుగా నరేష్.. పుల్లయ్యగా శుభలేఖ సుధాకర్.. కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్.. పీతాంబరం పాత్రలో సాయిమాధవ్ బుర్రా.. విఠలాచార్య పాత్రలో ఎన్ శంకర్.. కృష్ణకుమారి పాత్రలో ప్ర‌ణీత సుభాష్.. సావిత్రి పాత్రలో నిత్యామీనన్.. జయప్రదగా హన్సిక.. ప్రభ పాత్ర‌లో శ్రీయ.. జయసుధ గా పాయల్ రాజ్ పుత్ న‌టిస్తున్నారు. కేఎం రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ.. దాసరి నారాయణరావు పాత్రలో చంద్ర సిద్ధార్థ.. రేలంగి నరసింహారావు పాత్రలో బ్రహ్మానందం.. యోగానంద్ గా రవి ప్రకాష్.. రామోజీరావు గా గిరీష్.. ఎస్.వి.రంగారావు గా ఈశ్వర్ బాబు.. తాతినేని ప్రకాశరావుగా వాసు ఇంటూరి.. షావుకారు జానకి పాత్రలో షాలిని పాండే.. పింగళి గా సంజయ్.. మార్కస్ బార్ట్లే గా అర్జున ప్రసాద్ న‌టించారు. 

గుమ్మడిగా దేవీ ప్రసాద్.. కమలాకర కామేశ్వరరావుగా ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇందిరాగాంధీగా సుప్రియ వినోద్.. సి.నారాయణరెడ్డి పాత్రలో రామజోగయ్యశాస్త్రి.. కరుణానిధిగా సికిందర్.. నరసరాజుగా అవసరాల శ్రీనివాస్.. రాఘవేంద్రరావు గా అత‌డి త‌న‌యుడు ప్రకాష్ కోవెలమూడి.. దగ్గుపాటి వెంకటేశ్వరరావు పాత్రలో భ‌రత్ రెడ్డి.. రుక్మానంద రావుగా వెన్నెల కిషోర్.. మండలి వెంకట కృష్ణారావుగా మండలి బుద్ధ ప్రసాద్ నటిస్తున్నారని జాబితా విడుదల చేశాడు ద‌ర్శ‌కుడు క్రిష్. 

More Related Stories