English   

రీ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న ఊహ‌.. హీరో ఎవ‌రో తెలుసా..?

OOha
2018-12-25 19:29:00

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మాజీ హీరోయిన్ ల రీ ఎంట్రీల టైం నడుస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా చక్రం తిప్పిన వాళ్లంతా ఇప్పుడు అత్త, అమ్మ‌ క్యారెక్టర్లతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో మరో హీరోయిన్ కూడా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటితరం హీరోయిన్.. హీరో శ్రీకాంత్ భార్య ఊహ రీ ఎంట్రీకి సిద్ధమవుతుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. 20 ఏళ్ల కింద శ్రీకాంత్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయింది ఊహ. అప్పటి నుంచి పిల్లల ఆలనాపాలనా తనే చూసుకుంటుంది. ఊహ రీ ఎంట్రీ గురించి ఎప్పుడు అడిగినా కూడా తన ఇష్టం అంటూ శ్రీకాంత్ కూడా మాట దాటవేశాడు. 

ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చింది. ఊహ త్వరలోనే ఓ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంద‌నే వార్తలు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి. ఈమె నటించబోయేది ఎవరో బయట హీరోతో కాదు.. తన కొడుకు రోషన్ రెండో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తుంది. రెండేళ్ల కింద నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్ రెండో సినిమా కోసం భారీగా తీసుకున్నాడు. 2019లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి అందులో తనయుడుతో కలిసి ఊహ ఎలాంటి పాత్రలో నటించనుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఏదేమైనా ఇన్నేళ్ళ తర్వాత ఊహ మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తే ఆమె అభిమానులకు పండగే.

More Related Stories