English   

బాలీవుడ్ హీరోల‌పై రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 

Rajamouli
2018-12-25 12:50:40

అవును.. రాజ‌మౌళి నిజంగానే ఇప్పుడు బాలీవుడ్ హీరోల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. బాహుబ‌లి త‌ర్వాత ఈయ‌న పేరు బాలీవుడ్ లోనూ మార్మోగిపోతుంది. అందుకే ఈయ‌న కూడా అక్క‌డి హీరోల గురించి స్టడీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈయ‌న‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. బాలీవుడ్ హీరోలకు, టాలీవుడ్ హీరోలకు తేడా ఏంటి.. ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే వాళ్ళ మార్కెట్ ఎక్కువ.. మన మార్కెట్ తక్కువగా ఉంటుంద‌ని సమాధానం చెబుతారు. కానీ రాజమౌళి మాత్రం మరోలా ఆలోచించాడు. దక్షిణాది హీరోలకు, బాలీవుడ్ హీరోలకు చాలా తేడాలున్నాయని.. అక్కడి హీరోలకు అభిమానుల‌ను ఎలా తృప్తి పరచాలో తెలియదని చెప్పాడు రాజమౌళి. కానీ సౌత్ లో మాత్రం హీరోలు అలా కాదని.. ఇక్కడ హీరోలు అభిమానులు ఏం చెప్తే అది చేస్తానని చెప్పాడు. 

ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకొని వాళ్ళ అభిరుచికి తగ్గట్టు సౌత్ హీరోలు సినిమాలు చేస్తార‌న్నాడు జక్కన్న. కానీ బాలీవుడ్ హీరోలు అలా కాదని.. అక్కడి హీరోలు కేవలం తమ అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తారని.. అందుకే అప్పుడప్పుడు అవి డిజాస్ట‌ర్స్ అయిపోతుంటాయ‌ని చెప్పాడు ఈ ద‌ర్వ‌కుడు. ఈ ఒక్క తేడానే తాను ప్రధానంగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోల మధ్య గమనించాన‌ని కాఫీ విత్ కరణ్ షోలో మనసు విప్పి చెప్పాడు రాజమౌళి. ఈ సమాధానానికి కరణ్ జోహార్ కూడా అవునన్న‌ట్లు త‌ల ఊపేసాడు. నిజంగానే బాలీవుడ్ హీరోలకు ఎలాంటి కథలు కావాలో ఎంచుకోవడం తెలియదని చెప్పాడు కరణ్ జోహార్. మొత్తానికి ఈ షోలో ఇవే కాదు.. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పాడు దర్శకధీరుడు.

More Related Stories